TG: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణకు మరిన్ని రహదారులు మంజూరు చేయాలని కోరారు. 100 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. అటవీ, వన్యప్రాణి చట్టాలతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. అందుకే అటవీ నిబంధనలు సవరించాలన్నారు.