GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని తిక్కిరెడ్డిపాలెంలో శుక్రవారం ‘ఒక నెల-ఒక నియోజకవర్గం- నాలుగు సందర్శనలు’ మొదటి కార్యక్రమం జరిగింది. కలెక్టర్ సాయి కాంత్ వర్మ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఈ సదస్సులో పాల్గొని ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఇబ్బందులకు నాణ్యమైన, వేగవంతమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.