NDL: ఆత్మకూరులో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. గురువారం ఆత్మకూరు పట్టణ కేంద్రంగా సాగుతున్న నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని గుర్తించి, భారీగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన భయంకరమైన నిజాలు స్థానికులను విస్తుపోయేలా చేశాయి.