WNP: పేద ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ కోమారి రామ్మూర్తి నాయుడు అన్నారు. పానగల్ మండల పరిధిలోని గురువారం బండపల్లి గ్రామానికి చెందిన కోమారి చెన్నమ్మకు రూ.32వేలు, పెరుమాల బాలయ్యకు రూ.19వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు కాగా, అందజేసినట్లు ఆయన తెలిపారు.