KKD: గొల్లప్రోలు మండలం చెందుర్తి ZP ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న భాగ్యలక్ష్మి సైనికులపై తన దేశభక్తిని చాటుకుంది. లీఫ్ కార్వింగ్ కళ ద్వారా టెర్రరిజాన్ని అంతం చేసే సైనికుల చిత్రాలను బాదం ఆకుపై అత్యంత ప్రతిభావంతంగా చెక్కింది. తన జీవశాస్త్ర ఉపాధ్యా యుడు గోవిందరాజుల వద్ద ఈ లీఫ్ కార్వింగ్లో ప్రత్యేక శిక్షణ పొందినట్లు విద్యార్థిని తెలిపింది.