జోగులాంబ గద్వాలలో TUCI ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో కరపత్రాలు పంపిణీ చేసి గోడపత్రిక విడుదల చేశారు. రాష్ట్రంలోని కార్మికులకు సంక్షేమ బోర్డు ప్రయోజనాలు పూర్తిగా అందడం లేదని జిల్లా అధ్యక్షుడు సి. హనుమంతు అన్నారు. 60 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.9,000 పెన్షన్ ఇవ్వాలని, డెలివరీ, వివాహ గిఫ్ట్, మరణ సహాయం వంటి పథకాల లబ్ధిని పెంచాలని డిమాండ్ చేశారు.