HYDలో మండుతున్న ఎండలు, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో జలమండలి ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మే నెల తొలి 20 రోజుల్లోనే 2.60 లక్షల ట్యాంకర్లను సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోజుకు సగటున 12వేలకుపైగా ట్యాంకర్లు పంపిణీ చేస్తున్నారు. గతంలో ఏప్రిల్లో ఎక్కువగా ఉండే డిమాండ్ ఈసారి మేలో మరింత పెరిగింది.