TG: ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు, ఇతర నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అంశంపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.