BPT: కారంచేడు పోలీసుల చొరవతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి బాధితుడికి అందింది. కాకుమాను మండలం కట్రపాడుకు చెందిన ఎ. శ్రీనివాసరావు కూలి పనుల నిమిత్తం కారంచేడు వచ్చి తన ఫోన్ పోగొట్టుకున్నారు. ఈ నెల 10న ఆయన కారంచేడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్‌ను గుర్తించారు. రికవరీ చేసిన ఫోన్‌ను ఎస్సై ఖాదర్ భాషా గురువారం బాధితుడికి అప్పగించారు.