సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం గౌరవెల్లి రిజర్వాయర్ కట్టపై ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల జీఆర్ఎంబీ అధికారులు రిజర్వాయర్ను పరిశీలించిన సందర్భంగా, ఆకతాయిలకు అందకుండా ఎత్తైన ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.