MDCL: నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ ఎన్నారై కాలనీలో వీధి దీపాలు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ సమస్యను కాలనీ ప్రతినిధి బొట్ల తిరుపతి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు తాత్కాలిక పరిష్కారాలు చూపుతూ చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.