HNK: హన్మకొండ కాకాజీ అడ్వకేట్స్ కాలనీలో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన “కవిత్వంతో కలుద్దాం” కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. ప్రతి సామాజిక ఉద్యమాన్ని అందుకునే తొలి సాహిత్య రూపం కవిత్వమని అన్నారు. పోరాటాల కేంద్రంగా పేరుగాంచిన వరంగల్, సాహిత్య ఉద్యమాల్లో కూడా ఎప్పటికప్పుడు అగ్రగామిగా నిలుస్తోందని ఎంపీ పేర్కొన్నారు.