BHNG: దెయ్యం బండ తండా పంచాయతీ పరిధిలోని మంచిరోనిమమిల్లు గ్రామంలో లో-వోల్టేజ్ సమస్యతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ఎర్త్ సరిగ్గా లేకపోవడం, మితిమీరిన వేడి వల్లే ఈ సమస్య వస్తోందని గుర్తించిన సర్పంచ్ సుధాకర్ నాయక్ స్వయంగా రంగంలోకి దిగారు. వోల్టేజ్ పెంచేందుకు ఆయన ట్రాన్స్ఫార్మర్ ఎర్త్ పిట్లలో ట్యాంకర్‌తో నీళ్లు పోయించారు.