ATP: సౌత్ ఇండియా జాతీయస్థాయి కుస్తీ పోటీలలో అనంతపురం బాలిక కొప్పల అనూష రజత పతకం సాధించింది. పాండిచ్చేరిలో జరిగిన అండర్-15 పోటీలలో ప్రతిభ చాటిన ఆమెను కలెక్టర్ ఆనంద్, జేసీ విష్ణు చరణ్ అభినందించారు. ఒకే సంవత్సరంలో మూడు జాతీయ పోటీలలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన శాప్ లీగ్ బాక్సింగ్ పోటీలలో మేఘన రాజు బంగారు పతకం సాధించారు.