ATP: జూన్ నెలలో జిల్లా వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్‌లపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. పోలీస్, రవాణా, బీమా సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సబ్ డివిజన్ల వారీగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అక్కడికక్కడే లైసెన్సులు, బీమా నమోదు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.