KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను పరీక్షల విభాగం కంట్రోలర్ డా. ఎస్. వెంకటేశ్వర్లు విడుదల చేశారు. బీఏ 18కి 17, బీబీఏ 1కి 1, బీకాం 106కు 65, బీఎస్సీలో 99 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 72 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.