NGKL: జిల్లాలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా కిడ్నీ రోగులకు నాణ్యమైన డయాలసిస్ సేవలు అందుతున్నాయని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి తెలిపారు. 10 డయాలసిస్ మిషన్ల ద్వారా గతేడాదిలో 7306 సార్లు రోగులకు సేవలు అందించినట్లు వెల్లడించారు. ప్రతిరోజూ 25 నుంచి 30 మంది వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డయాలసిస్ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు.