E.G: రాజమండ్రి డిపోలో 218 టేకు చెట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు డిపోమేనేజర్ మాధవ్ గురువారం తెలిపారు. కొత్త ఎలక్ట్రికల్ బస్ స్టేషన్, పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం వీటిని తొలగిస్తున్నామన్నారు. ప్రభుత్వ అంచనా విలువ రూ. 91,719 కాగా, ఇవాల్టి నుంచి 25న సాయంత్రం 4 గంటల వరకు సీక్రెట్ టెండర్లు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు అవకాశాన్ని సద్వినియోగo చేసుకోవాలన్నారు.