కోనసీమ: ఆలమూరు మండలం గుమ్మిలేరు బీసీ ఏరియాలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న లో వోల్టేజ్ సమస్యతో 40 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితిలో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.