CTR: చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రూ.14.74 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన వసతి సముదాయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ వసతి సముదాయాల్లో 83 గదులు, 15 సూట్ రూములు, రెండు కామన్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.