KNR: చొప్పదండి గుమ్లాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెల్గటూర్ మండలం కిషన్రావుపేటకు చెందిన తిరుపతి (45) బైక్పై వెళ్తుండగా కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. హెల్మెట్ ధరించినప్పటికీ తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.