JGL: భీమారం మండల కేంద్రంలో గురువారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి క్రీడలను గ్రామ సర్పంచ్ చెక్కపల్లి స్వాతి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్యారం బోర్డు, చెస్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నీరజ, హౌసింగ్ ఏఈ హర్షిత, పీఈటీ తిరుమలేష్, తదితరులు పాల్గొన్నారు.