ADB: సోనాల మండల కేంద్రంలో 30,000 వేలు గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయని రైతులు అధైర్య పడొద్దని సహకారం సంఘం డైరెక్టర్ లోలపు పోశెట్టి పేర్కొన్నారు. గురువారం జొన్నల కొనుగోలు కేంద్రానికి 30 వేల గన్ని బ్యాగులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోనాల సర్పంచుల సంఘం అధ్యక్షుడు చౌహాన్ వినోద్ సింగ్, చింతల్ బోరి సర్పంచ్ శ్రీరామ్ ఉన్నారు.