ELR: దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 22A భూ సమస్యల పరిష్కార అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు బదిలీ చేయడంతో ఏలూరు జిల్లాలో కీలక అడుగు పడింది. ఈ మేరకు అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలిదిండి గ్రామంలోని సర్వే నంబర్లు 1051, 1083, 1084 పరిధిలోని 142 ఎకరాల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.