NTR: విజయవాడలో మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలకు ఊరట కల్పించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరంలోని 11 అన్న క్యాంటీన్ల వద్ద గురువారం తాత్కాలిక నీడ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. క్యూలైన్లలో నిలబడే ప్రజలకు ఎండ తాకిడి లేకుండా చర్యలు తీసుకున్నామని, త్రాగునీటి సరఫరాను కూడా పెంచామని చెప్పారు.