AKP: మత్స్యకార భరోసా పథకం కింద పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో 8,349 మంది మత్స్యకారులు లబ్ధి పొందినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వారి ఖాతాల్లో కూటమి ప్రభుత్వం రూ.16.69 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో వారికి చెక్కులను పంపిణీ చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు.