HYD: ORR, RRR మధ్య గ్రీన్‌బెల్ట్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్యూర్, ప్యూర్ రీజియన్ల మధ్య లక్ష ఎకరాలకు పైగా హరిత జోన్లు ఏర్పాటు చేసి చెరువులు, ఆక్వా కల్చర్, అగ్రిబిజినెస్కు ప్రోత్సాహం ఇవ్వనున్నారు. కాలుష్య నియంత్రణతో పాటు వర్షపాతం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతి 3.5 కిలోమీటర్లకు ఒక గ్రీన్ జోన్ ఏర్పాటు చేయనున్నారు.