PLD: ఈపూరు మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన ఆయన, మందుల నిల్వలు, రికార్డులు, అటెండెన్స్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడంలో సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.