TG: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్పై ఇద్దరు చర్చించారు. ఎంఎంటీఎస్ రైలు సర్వీసుల విస్తరణ, వాటి పురోగతిపై ఇరువురు నేతలు డిస్కస్ చేశారు.