NZB: వేల్పూర్ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గురువారం వైభవంగా సాయి పల్లకి సేవను నిర్వహించారు. భజన కళాకారులు బ్రహ్మాండమైన భజన పాటలు పాడి భక్తుల అభిమానాన్ని చూరగొన్నారు. గోమాతను పూజించారు. అన్న పూజను అన్నదాతలు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. అన్నదాతలను ఆలయ అర్చకులు శాలువా కప్పి, తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు.