TG: రాష్ట్రంలో కార్మికుల కనీస వేతనాలు ఈ విధంగా పెరగనున్నాయి. అన్స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.12,592 నుంచి రూ.16వేలకు, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.12,750 నుంచి రూ.17 వేలకు, స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,772 నుంచి రూ.18,500కి, హై స్కిల్డ్ కార్మికులకు రూ.14,607 నుంచి రూ.20వేలకు పెరగనున్నాయి. ఇవి జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.