ATP: పెద్దవడుగూరు మండలం అవులం పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలను ఎస్సై ఆంజనేయులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఎస్సై మాట్లాడుతూ.. రాతి దూలం లాగుడు పోటీలను ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ పోటీలు మరో రెండు రోజులపాటు జరుగుతాయన్నారు. ఈ పోటీలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.