WNP: ఖిల్లా ఘణపురం బస్టాండ్ జెండా కట్ట వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి చరణ్ రెడ్డి తదితరులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని దేశంలో, సాంకేతిక విప్లవానికి నాంది పలికారని కొనియాడారు.