NRPT: ఉపాధిహామీ కూలీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంవెంటనే పరిష్కరించాలని జిల్లా సీపీఎం కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఊట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామంలో ఉపాధి కూలీలతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. పెండింగ్లో ఉన్న పాతబకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు. అలాగే, రోజువారీ కూలీ రూ.600 తగ్గకుండా ఉండాలన్నారు.