GDWL: భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం గద్వాల పాత బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసిన ముందుచూపు గల నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.