ASF: దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం అని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాణానికి విశేష కృషి చేశారని కొనియాడారు.