WNP: వచ్చే వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటి జిల్లాలో అటవీ శాతం పెంచాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. గురువారం అదనపు కలెక్టర్ ఛాంబర్లో వనం మహోత్సవ కార్యక్రమం పై సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరంలో 20,60,900 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. లక్ష్యం సాధించేలా అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయాలన్నారు.