తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపు ఉదయం వరకు భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, MBNR జిల్లాల్లో వానలు పడే ఆస్కారముందని తెలిపింది. ఇక రానున్న 4 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని చెప్పింది. అటు APలోని శ్రీకాకుళం జిల్లాలోని పలుచోట్ల వర్షం కురిసింది.