NLG: రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా దాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్టు తెలిపారు.