సత్యసాయి: కదిరి రూరల్ మండలం మోటుకుపల్లి సచివాలయం వద్ద బుధవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, కొత్త పింఛన్లు, రోడ్డు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వీటిని పరిశీలించి అధికారులతో మాట్లాడి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.