AKP: అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామ నిర్వాసితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. అచ్యుతాపురంలో గురువారం నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బ్రాండిక్స్ యాజమాన్యం నిర్మించిన గోడ వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.