Yadagirigutta Brahmotsavams : శ్రీలక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
యాదగిరిగుట్టలో వేడుకగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు(Yadagirigutta Brahmotsavams) ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వస్తివచనం, పుణ్యవచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ప్రారంభించారు.
యాదగిరిగుట్టలో వేడుకగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు(Yadagirigutta Brahmotsavams) ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వస్తివచనం, పుణ్యవచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ప్రారంభించారు. విష్వక్సేన పూజ, స్వస్తి, పుణ్యవచన పూజా కైంకర్యాలను అర్చకులు నిర్వహించి వేదమంత్రాలను జపించారు. ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ ఛైర్మన్ నరసింహమూర్తితో పాటుగా అధిక సంఖ్యలో భక్తులు బ్రహ్మోత్సవాల(Brahmotsavams) ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు.
నేడు సాయంత్రం 6.30 గంటలకు మృత్సం గ్రహణం, అంకకురారోహణ జరపనున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు(Brahmotsavams) మార్చి 3వ తేది వరకూ కొనసాగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక 1955లో యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను 11 రోజుల పాటు చేసేవారు. అంతకుముందు భక్తోత్సవాలను వేడుకగా నిర్వహిస్తూ వచ్చేవారు. యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి(Yadagirigutta Lakshminarasimha swamy) ఆలయ పునర్నర్మాణం తర్వాత ఇలవైకుంఠంగా విరాజిల్లుతున్న ఆలయంలో మొదటిసారి వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు.
బ్రహ్మోత్సవా(Brahmotsavams)లలో భాగంగా నేటి ఉదయం విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టి పూజలు నిర్వహించారు. 27వ తేదిన ఎదుర్కోలు, 28న తిరు కళ్యాణోత్సవం జరగనుంది. స్వామివారి కళ్యాణోత్సవానికి సీఎం కేసీఆర్(CM KCR) దంపతులతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరవ్వనున్నారు. మార్చి 3వ తేది వరకూ 11 రోజుల పాటు ఈ వేడుకలు సాగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఆలయం పరిసరాలను విద్యుద్దాపాలంకరణ, రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవా(Brahmotsavams)లలో భాగంగా పదో రోజున చక్రతీర్థ స్నానం జరగనుంది. ఈ వేడుకకు విశేష సంఖ్యలో భక్తులు(Devotees) హాజరుకానున్నారు.