ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ రవాణా శాఖ నోటీసులో స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓలా, ఉబర్, రాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఢిల్లీలో బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగిస్తే జరిమానా విధించబడుతుందని వెల్లడించింది.
ఢిల్లీ(delhi) ప్రభుత్వం బైక్ ట్యాక్సీ(bike taxi)లపై తక్షణమే నిషేధం(ban) ప్రకటించింది. ఈ నిర్ణయం నగరంలో ప్రసిద్ధి చెందిన ఓలా, ఉబర్, రాపిడో వంటి బైక్ ట్యాక్సీలపై ప్రభావం చూపుతుంది. నాన్-ట్రాన్స్పోర్ట్ (ప్రైవేట్) రిజిస్ట్రేషన్ నంబర్లు ఉన్న ద్విచక్ర వాహనాలను ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నారని ఢిల్లీ రవాణా శాఖ నోటీసులో పేర్కొంది. వ్యక్తిగత వాహనాలను కమర్షియల్ ట్యాక్సీలుగా ఉపయోగించడం మోటారు వాహన చట్టం, 1988ని ఉల్లంఘించడమేనని ప్రభుత్వం ఈ మేరకు హెచ్చరించింది. మరోవైపు క్యాబ్‌ల ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఓలా(ola), ఉబర్(uber), రాపిడో(rapido) వంటి ద్విచక్ర వాహనాలపై ఆధారపడే అనేక మంది వినియోగదారులపై ఈ ప్రభావం చూపనుంది. ఢిల్లీ ట్రాఫిక్‌లో బైక్‌లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి చాలామంది ఈ సరసమైన రవాణా విధానాన్నిఉపయోగిస్తున్నారు.
బైక్ టాక్సీల(bike taxi)పై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ(delhi) రవాణా శాఖ నోటీసులో స్పష్టంగా పేర్కొంది. ఓలా, ఉబర్, ర్యాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఢిల్లీలో బైక్ టాక్సీ సేవలను కొనసాగిస్తే, రూ.5,000 జరిమానా విధించబడుతుందని ప్రభుత్వ నోటీసులో స్పష్టం చేసింది. రెండోసారి లేదా ఆ తర్వాత నేరం చేస్తే రూ.10,000 జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించబడుతుందని వెల్లడించింది.
టూవీలర్ క్యాబ్(two wheeler cab) సర్వీసుల్లో మరో పెద్ద సమస్య ఏమిటంటే ఎమర్జెన్సీ బటన్ కోసం సరైన ఏర్పాట్లు లేవు. దీంతో మహిళా ప్రయాణికుల(women passengers) భద్రతకు ముప్పు వాటిల్లుతోందని పలువురు అంటున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో ర్యాపిడో సేవలను సుప్రీంకోర్టు నిషేధించిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
ప్రస్తుత నియమం ప్రకారం డ్రైవర్, ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణీకులు ఉన్నచోటే టాక్సీ(taxi) సేవలు ఉంటాయి. దీని ప్రకారం, నాలుగు చక్రాల క్యాబ్‌లు, ఆటో-రిక్షాలు, ఇ-రిక్షాలు మాత్రమే అనుమతించబడుతున్నాయి. క్యాబ్ సేవలను నిర్వహించడానికి కూడా కొన్ని నియమాలు ఉండాలని ఇప్పటికే ప్రకటించారు. వాహనం రిజిస్ట్రేషన్ గుర్తు, పసుపు నంబర్ ప్లేటు, పోలీసు ధృవీకరణ తర్వాత జారీ చేయబడిన PSV బ్యాడ్జ్, డ్రైవర్లు ప్రవర్తనా సెషన్లను కలిగి ఉండాలని అధికారులు వెల్లడించారు.