నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల స్టాక్ రిజిస్టర్, ఏఎన్ఎంల లభ్యతపై ఆయన ఆరా తీశారు. రోగులను అడిగి వైద్య సేవల తీరుతెన్నులను తెలుసుకున్నారు.