మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులకు ఇచ్చే కమీషన్లను ఫండ్ యూనిట్ల రూపంలో చెల్లించే విధానాన్ని సెబీ ప్రతిపాదించింది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు దీర్ఘకాలిక పెట్టుబడులపై ప్రోత్సాహం లభిస్తుంది. ఈ థర్డ్ పార్టీ చెల్లింపులు దుర్వినియోగం కాకుండా, మనీ లాండరింగ్‌ను అడ్డుకునేందుకు పటిష్ఠమైన KYC, డిజిటల్ నిధుల బదిలీని తప్పనిసరి చేసింది. ఈ ముసాయిదాపై జూన్ 10 వరకు అభిప్రాయాలు తెలియజేయవచ్చు.