Rajamouli – Mahesh : రాజమౌళి భారీ ప్లాన్.. మహేష్‌తో మల్టీ స్టారర్!?
Rajamouli - Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రూమార్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రూమార్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఏ చిన్న పుకారు వచ్చిన క్షణాల్లో సోషల్ మీడియా మోత మోగిపోతోంది. తాజాగా బయటకొచ్చిన ఓ న్యూస్.. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై మరింత హైప్ తీసుకొచ్చేలా ఉంది. ప్రస్తుతం రాజమౌళితో సినిమాలు చేయడానికి బడా బడా హీరోలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.. రాజమౌళితో సినిమా చేసేందుకు ఎదురు చూస్తున్నానని, చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఆయన దర్శకత్వంలో ఎలాంటి పాత్ర అయినా సరే.. చేయడానికి సిద్ధమని, సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతునే ఉన్నాడు. జక్కన్న కూడా సమయం వచ్చినప్పుడు అమీర్ ఖాన్‌తో చేస్తానని చెబుతున్నాడు. అయితే ఇప్పుడా సమయం రానే వచ్చిందని అంటున్నారు. తాజాగా రాజమౌళి.. మహేష్ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం అమీర్ ఖాన్‌ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. అమీర్ కూడా అందుకు ఓకే చెప్పాడనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో అమీర్ ఖాన్ కోసం ట్రై చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు మహేష్ సినిమా కోసం అంటున్నారు. కాబట్టి.. నిజ నిజాలేంటనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ రాజమౌళి సినిమాలో అమీర్ ఖాన్ నటిస్తే మాత్రం.. ఇదో భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ అవనుంది. అదే జరిగితే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.