VZM: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ నమోదు క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు సౌకర్యవంతంగా క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.