SRD: సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్, కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరైన లారీలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, మధు, సాయిబాబా, పాపన్న పాల్గొన్నారు.