WNP: ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రతి రాజకీయ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్‌ను నియమించి బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్ ఎన్ఐసి హాల్ లో త్వరలో చేపట్టనున్న ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.