HYD: నిరుద్యోగ జేఏసీ నాయకురాలు ఆస్మా ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరుద్యోగుల ఆవేదన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా BRSV నాయకులు గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి కేబినెట్ సమావేశంలో 20 వేల మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు వేస్తామని హామీ ఇచ్చి, నేడు మోసం చేశారని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి కేవలం 16 వేల ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు.